మహిళా సంఘం సహాయకు ( వీ వో ఏ) లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక..

వారి నెల జీతాలు పెంచుతూ సిఎం నిర్ణయం..

సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తక్షణమే జారీ అయిన జీ.వో…

యూనిఫాం కోసం నిధుల విడుదలకు., రెనివల్ విధాన సవరింపునకు., సిఎం అంగీకారం..

జీవిత బీమా అమలు చేయాలనే విజ్జప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం..

ఇందుకు సబంధించి మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు కు సిఎం కేసీఆర్ ఆదేశం…

ఈ మేరకు.. సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీ రాథోడ్ లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో సమావేశమైన మంత్రి హరీశ్ రావు…

సిఎం కేసీఆర్ నిర్ణయాలు వారికి వెల్లడించిన మంత్రి హరీశ్ రావు..

జీతాలు పెంచుతూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు..

మహిళా సంఘాల ప్రతినిధులకు ఉత్తర్వుల కాపీని అందజేసిన మంత్రులు

హర్షాతిరేకాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..మంత్రులకు రాఖీలు కట్టి తమ కృతజ్జత తెలుపిన వీ వో ఏ లు..

గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోని తమను ఆదరిస్తూ ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు సిఎం కేసీఆర్ గారికి రుణపడి వుంటామని ప్రకటన..

రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీ వో ఏ) ల వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.
సిఎం గారి నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ. 8000 కు పెరగనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకు ( వీ వో ఏ) లకు లబ్ధి చేకూరనున్నది. సిఎం కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ. 106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనున్నది. అయినా ఖర్చుకు వెనకాడకుండా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ గారు మానవీయ కోణంలో వేతన పెంపు నిర్ణయం తీసుకున్నారు.

ఇతర విజ్జప్తులనూ అంగీకరించిన సిఎం :
తమ జీతాలు పెంచాలని, తమకు యూనిఫాం కోసం నిధులను అందించాలని, తమకు ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెనివల్ విధానాన్ని సవిరిస్తూ దాన్ని ఏడాదికి పెంచాలని, విజ్జప్తులను తక్షణమే పరిష్కరిస్తూ సిఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాగా తమకు జీవిత బీమా కూడా అమలు చేయాలనే మహిళా సంఘాల సహాయకుల విజ్జప్తికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

తాము యూనిఫాం డ్రెస్ విధానాన్ని అనుసరిస్తామని, అందుకోసం నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాల సహాయకుల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ. 2 కోట్లు నిధులను అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి, ప్రతి మూడు నెల్లకు వో సారి చేసే రెనివల్ విధానాన్ని ఇకనుంచి ఏడాదికి చేసేలా సవరించాలని సిఎం నిర్ణయించారు. వీఏవోలు తమకు జీవిత బీమా అందించాలని సిఎం గారికి చేసుకున్న విజ్జప్తికి సానుకూలంగా స్పందించిన సిఎం గారు ఇందుకు సంబంధించిన విధి విధనాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సిఎం ఆదేశించారు.

కాగా… గతంలో తమను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలోనే సిఎం కేసీఆర్ గారు తీసుకున్న మానవీయ నిర్ణయంతోనే తమకు నేడు నెలజీతాలతో భరోసా దొరికిందని, తమను ఆదరిస్తూ ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు సిఎం కేసీఆర్ గారికి రుణపడి వుంటామని మంత్రులతో సమావేశమైన మహిళా సంఘాల సహాయకులు ( వీవోఏ) లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో గౌతమ్ పొట్రు, పలువురు వీఏవో మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వీవోఏలు… జీతాల పెంపు… వారి వివరాలు :
ఉమ్మడి రాష్ట్ర కాలంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ, సంఘానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, తదితర సమాచారాన్నినోట్ బుక్కుల్లో నమోదు చేసే విధులను స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వీరి కృషిని కనీసం గుర్తించని నాటి ప్రభుత్వాలు వారి మానాన వారిని వదిలేసాయి. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాలనుంచి మాత్రమే ‘‘ గ్రూపు లీడర్లు’’ గా కేవలం నెలకు రెండు వేలు రూపాయలు గౌరవ వేతనం తప్ప వారికి మరో ఆసరా లేకుండే. కాగా, పొదుపు సంఘాలలోని మహిళలను సంఘటితం చేస్తూ, వారిని చైతన్య పరుస్తూ సమన్వయ కర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీవోఏ ల కృషిని, స్వచ్ఛందంగా వీరు చేస్తున్న సేవలను స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించారు. తద్వారా సిఎం కేసీఆర్ మానవీయ పాలనలో వీరికి కూడా ఎంతో కొంత గౌరవ వేతనం అందించాలని నిర్ణయం జరిగింది.
దాంతో… 2016 సంవత్సరం నుంచి వీరికి నెలకు మూడు వేల రూపాయలను గౌనవ వేతనంగా అందించడం జరిగుతూ వస్తున్నది. అంతే కాకుండా అందరికీ ఇటీవలే పెంచిన పీఆర్సి ని వీరికి కూడా అమలు చేస్తూ మరోమారు తన మానవీయ కోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దాంతో వీరికి ప్రభుత్వం అందించే వేతనం రూ.3900 కు చేరింది. దాంతో మహిళా సంఘాలనుంచి అందే రెండు వేలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే 3900 మొత్తం కలిపితే వీరి వేతనం కేవలం రూ.5900 మాత్రమే. ఈ పరిస్థితుల్లో వీరు క్షేత్రస్థాయిలో పడుతున్న కష్టాన్ని గుర్తించిన సిఎం కేసీఆర్ మరోసారి ఆదకుని ఆసరానందించేందుకు నిర్ణయించారు. వారి విజ్జప్తి మేరకు రాఖీ పండుగ కానుకగా వీరి జీతాలను పెంచాలని నిర్ణయించారు.

తాజావార్తలు