మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉంది కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 19 (జనంసాక్షి);
మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం నిజాంబాద్ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్ లో మహిళా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలు వ్యాపారం చేపట్టి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. వ్యాపారం చేసేందుకు ముందుకు వచ్చే సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తాయని సూచించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 20 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శోభ, రీజినల్ మేనేజర్ నారాయణ, లీడ్ బ్యాంకు మేనేజర్ చిందం రమేష్, డి ఆర్ డి ఓ సాయన్న, నాబార్డ్ డిడిఎం నగేష్, జిల్లా సమైక్య ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.