మహేశ్‌ పోకిరీకి ఆధునిక సాంకేతికత జోడిరపు

రీ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్న మేకర్స్‌
మహేష్‌ ’పోకిరి’ విడుదలై దాదాపు పదహారేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెర టీఆర్పీల్లో వెనకబడలేదు. అయితే ఈ సినిమాని నేటి అధునాతన డిజిటల్‌ సాంకేతికతను జోడిరచి రీ రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుంది? .. ఇదే ఆలోచన మేకర్స్‌ కి వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని 4ఐ రిజొల్యూషన్‌ లోకి రీ మాస్టర్‌ చేసి డాల్బీ ఆడియోతో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆగస్ట్‌ 9న మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఇరు తెలుగు రాష్టాల్ల్రో భారీ ప్రీమియర్లు వేయనున్నారని తెలిసింది. ప్రతిసారీ తన పుట్టినరోజున ఫ్యాన్స్‌ కి ఏదో ఒక కొత్త విషయం అందించే మహేష్‌ ఈసారి స్పెషల్‌ గిప్ట్‌ ని ప్లాన్‌ చేసారని కూడా దీనిని బట్టి అర్థమవుతోంది. డిజిటల్‌ మాస్టరింగ్‌ అయ్యాక పోకిరిని భారీ ప్రీమియర్లుగా రిలీజ్‌ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో బిజినెస్‌ మెన్‌` శ్రీమంతుడు లాంటి సినిమాల్ని రీరిలీజ్‌ చేయగా అభిమానులు ఎంతో ఖుషీ అయ్యారు. పోకిరితో మరోసారి అలాంటి మ్యాజిక్‌ రిపీట్‌ కానుంది. మహేష్‌ కెరీర్‌ లోనే పోకిరి రికార్డ్‌ బ్రేకింగ్‌ హిట్‌. ప్రిన్స్‌ మహేష్‌ ని సూపర్‌ స్టార్‌ ని చేసిన చిత్రమిది. 16 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్‌ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. పోకిరి చిత్రంతో మహేష్‌ .. ఇలియానా లాంటి స్టార్ల రేంజే మారిపోయింది. ముఖ్యంగా మహేష్‌ ని రొటీన్‌ పాత్రల నుంచి బయటపడేసిన చిత్రమిది. ఈ మూవీకి పూరి రాసిన డైలాగులు ఎప్పటికీ ఇండస్టీ ట్రెండ్‌ సెట్టర్స్‌. ఇలియానా అందచందాలు.. బ్రహ్మానందం కామెడీ.. యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్స్‌ గా నిలిచి సక్సెస్‌ లో కీలక భూమికను పోషించాయి.

తాజావార్తలు