మాకు తగిన సంఖ్యాబలం ఉంది: ప్రధాని
ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈరోజు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైంది. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఓటింగ్‌తో కూడిన చర్చ జరిగినా తమకు అభ్యంతరం లేదని, తగిన సంఖ్యాబలం తమకుందని నమ్మకం వ్యక్తం చేశారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా యూపీఏ ఈ విషయంలో ఏకతాటిపై నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐల అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడం వల్ల వరసగా నాలుగోరోజూ పార్లమెంటు ఉభయసభలూ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.