మాచర్ల నియోజకవర్గం నుంచి మెలోడీ సాంగ్
యంగ్ హీరో నితిన్ ప్రాధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే నితిన్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి యాక్షన్ రోల్‌ను పోషించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలకు క్రియేట్ చేశాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ’అదిరింది’ అంటూ సాగే మెలోడియస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో నితిన్, కృతి శెట్టి మధ్య కెమిస్టీ బాగా కుదిరింది. వీరిద్దరి డ్యాన్స్ మూవ్‌మెంట్స్ అలరిస్తున్నాయి. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సంజిత్ హెగ్డే ఆలపించాడు. దిగ్గజ స్వర కర్త మణిరత్నం కుమారుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ’రా రా రెడ్డి’ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ /ఎంట్టంల్గªనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.