మాజీ ఎమ్మెల్యే డా. సుధాకర్ రావుకు మానవతా సేవ పురస్కారం
ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ మంత్రి హరీష్ రావు
పెద్ద వంగర అక్టోబర్ 10( జనం సాక్షి )
కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయటం కొరకు డాక్టర్ వృత్తిని మరియు రాజకీయాలను ఎంచుకున్న డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు (ఎండోక్రినాలోజిస్ట్)కు సేవలను గుర్తించి హైదరాబాద్ లో జరిగినటువంటి డ్రీమ్ వాలే గ్రీన్ అండ్ హైదరాబాద్ బిజినెస్ టీవీ, 12 వ వార్షికోత్సవంలో ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మరియు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ పార్లమెంట్ మెంబర్ బూర నర్సయ్య గౌడ్, డాక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా మానవత సేవ పురస్కారం అందజేశారు. ఆయన సేవలు చాలా గొప్పవని కొనియాడారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎన్.సుధాకర్ రావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గా, డాక్టర్ వృత్తిలో భాగంగా ప్రజలకు ఎంతో సేవ చేసానని,నేను నిరంతరం ప్రజల మంచి కోరే మనిషినని, ప్రజలకు రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు అన్ని రంగాల్లో పాల్గొంటాను అన్ని అభివృద్ధి పనుల్లో అండదండగా ఉంటానన్నారు.