మాజీ ఎమ్మెల్యే ద్వితీయ వర్దంతి సందర్భంగా అన్నదానం.
అన్నదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు.
బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి)
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ ద్వితీయ వర్దంతి సందర్భంగా జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 130 వ సారి అన్నదాన కార్యక్రమం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ ద్వితీయ వర్దంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు గుండా సరోజిని దేవి, సమత, సోనియా, రోషిణి, ప్రశాంత్, జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, ఉపాధ్యక్షురాలు హనుమండ్ల రమాదేవి, సభ్యులు నిచ్చకోలా గురుస్వామి పాల్గొన్నారు.