*మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా సుంకర క్రాంతి కుమార్*
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.మాజీ ప్రజాప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా పెంచికల్ దిన్న గ్రామ మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ను నియమకాన్నీ హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి శంకర్,మరియు ఇతర కమిటీ సభ్యులు నియామకం జరిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ మాజీ ప్రజా ప్రతినిధులు గౌరవాన్ని కాపాడేలా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.