మాజీ ప్రధాని గుజ్రాల్ ఆరోగ్యపరిస్థితి విషమం
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో నవంబర్ 19 నుంచి చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నరేష్ టెహ్రాన్ నేతృత్వంలోని 9 మంది వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.