మాజీ సైనికులకు తోడ్పాటునందించండి

సంగారెడ్డి, డిసెంబర్‌ 7 ): దేశభద్రత కోసం అవిశ్రాంతంగా పోరు సాగించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చేయూతనందించాల్సిన భాధ్యత ప్రతి ఒ్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం సాయుధ దళాల పతాక దినోత్సవము సందర్భంగా క్యాంపు కార్యాలయములో ఎన్‌సీసీ విద్యార్థుల ద్వారా మాజీ సైనికులకు విరాళం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి నరేందర్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ యం.రమేష్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ జి. శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.