మాజీ సైనికుల పోరాటానికి రాహుల్‌ మద్దతు

3
న్యూఢిల్లీ, ఆగస్ట్‌14(జనంసాక్షి):

వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌ కోసం ఆర్మీ మాజీ సైనికులు రోడ్డెక్కారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మాజీ సైనికులు ధర్నాకు దిగారు. ఆర్మీలో ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ ను ఆమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు తెలిపారు. ధర్నా చేస్తున్న మాజీ సైనికులను ఆయన కలుసుకున్నారు. దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ సమస్యలను కూడా ఎన్డీఏ సర్కార్‌ పరిష్కరించలేకపోతోందని ఆయన విమర్శించారు. ధర్నా చేస్తున్న ఆర్మీ మాజీ ఉద్యోగులను జంతర్‌ మంతర్‌ వద్ద నుంచి తరిమివేయాలని ప్రయత్నించటం దారుణమని విమర్శించారు. ఈ అంశంలో ప్రధాని ఒక్క ప్రకటన చేస్తే చాలు సమస్య పరిష్కరమవుతుందని రాహుల్‌ అన్నారు.