మాట్లాడుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య

బహుజనుల బలంతో ఎన్నికల బరిలో సీపీఐ(ఎం)

పోడుపై పోరాటలతో దిగివచ్చిన కేసీఆర్‌ -సీపీఐ(ఎం) నేతలు

3న కారేపల్లిలో సీతారాం ఏచూరి సభ

కారేపల్లి: బహుజనుల బలంతో సీపీఐ(ఎం) ఎన్నికల బరిలో నిలిచిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.సోమయ్య అన్నారు. ఆదివారం కారేపల్లిలో జరిగిన ముఖ్యకార్యకర్తలసమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల సమస్యలపై సామాజిక సమస్యలపై సీపీఐ(ఎం) చేసిన ఉద్యమం రాష్ట్రంలో బహుజనులను చైతన్య వంతులను చేసిందన్నారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడిన సీపీఐ(ఎం) ఆ వర్గాల అండతో ఒంటరిగా రంగంలోకి దిగిందన్నారు. కేసీఆర్‌కు తాను అధికారంలోకి వస్తాననే ధీమా పోయిందన్నారు. నిరంకశత్వంగా ఏలితే ప్రజలను సహించరని కేసీఆర్‌కు ముందుముందు తెలుస్తుందన్నారు. కూటమీలో కుమ్ములాటల సెగలు ఇంకా అరలేదని, కాంగ్రెస్‌ తన నిజస్వరాపాన్ని కూటమి పక్షాలకు రుచి చూపించిందని ఎద్దేవా చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనుల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని, సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా పోడుపై కేసీఆర్‌ దిగి వచ్చి పోడు పై అనుకూల ప్రకటనలుచేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఎన్ని వాగ్ధానాలు చేసిన నమ్మే పరిస్ధితి లేదని, గతంలో పేదలకు ఇచ్చిన ఏ వాగ్ధానం అమలు చేయని పరిస్ధితి చూస్తున్నామన్నారు. ప్రజల సమస్యలపై నిరంతం పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారని, యువకుడు, పేదల సమస్యలపై పోరాడి జైలుకెళ్ళిన భూక్యా వీరభధ్రంనాయక్‌ గెలుపు ఖాయమన్నారు. డిసెంబర్‌ 3న కారేపల్లిలో జరిగే బహిరంగ సభకు సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి రానున్నారని ఆ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, కే.నాగేశ్వరరావు మండలకార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు ముత్యాల సత్యనారాయణ, మెరుగు రమణ, తలారి దేవప్రకాశ్‌, బాదావత్‌ రాములు, గుర్రం వెంకటేశ్వర్లు, పండగ కొడయ్య, కరపటి సీతారాములు, భాగం వెంకటప్పారావు, కే.ఉమావతి, మన్నెం బ్రహ్మయ్య, ఈసం ఎల్లయ్య, ముండ్ల ఏకాంబరం, అన్నవరపు కృష్ణ, రేపాకుల లాలయ్య తదితరులు పాల్గొన్నారు.