మాడల్‌ జిల్లాగా మెదక్‌

సంగారెడ్డి, జనవరి 30 (): జిల్లాలో ఇంతవరకు యూనిసెఫ్‌ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఇండియా యూనిసెఫ్‌ చీప్‌ క్యారీఓర్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జరిగిన యూనిసెఫ్‌ సమావేశంలో యూనిసెఫ్‌ చీప్‌ మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న బిహెవియర్‌ చేంజ్‌ కమ్యూనికేషన్‌, సంపూర్ణ పారిశుద్ధ్యం, పరిష్కారం, బాల విలేకరుల, బ్రిడ్జి స్కూల్‌ ఫర్‌ మైగ్రేంట్‌ విల్ట్రన్‌, వాటర్‌ క్యాలీటి వంటి కార్యక్రమాలు యూనిసెఫ్‌ ద్వారా చేపట్టి మంచి ఫలితాలు రాబట్టడం జరిగిందని అన్నారు. యూనిసెఫ్‌ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా మాడల్‌ జిల్లాగా నిలిచిందని ఆమె అన్నారు