మాణికర్యారంలో మాట్లాడుతున్న మెరుగు సత్యనారాయణ

మండలంలో సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం

ప్రలోభాలకు గురికావద్దు

పేదలకు అండ సీపీఐ(ఎం) – మెరుగు సత్యనారాయణ

కారేపల్లి : కారేపల్లి మండలంలో సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గ అభ్యర్ధి భూక్యా వీరభధ్రంనాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించింది. కారేపల్లి మండలం మాణికార్యం, కారేపల్లి సంత, విశ్వనాధపల్లి, గుంపెళ్ళగూడెం, చర్లపల్లి, వడ్డుగూడెం గ్రామాల్లో భూక్యా వీరభద్రంనాయక్‌ గెలుపును కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ప్రజానాట్యమండలి కళాకారుల కోలాట నృత్యం, డప్పు వాయిద్యాలతో ప్రచారం ఆకట్టుకుంది. ఈసంధర్బంగా జరిగిన సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ ఓట్ల కోసం పార్టీలు గురిచేసే ప్రలోభాలకు పడిపోవద్దని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ అన్నారు.ఓటర్లను కోరారు. పోడు సాగు కోసం పాట్లు పడుతూ అనేక శరలు పడినా పట్టించుకోని పార్టీలు నేడు ఎన్నికలు వస్తుండటంతో ఓట్లకోసం మాయ మాటలతో రానున్నారన్నారు. ప్రజావసరాలు పట్టించుకోకుండా తమ అవసరం కోసం వస్తున్న టీఆర్‌ఎస్‌, మహాకూటమీలకు ఓటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు. పేదల ఆపదలో ఉంటే సీపీఐ(ఎం) వెన్నంటే ఉండి వారికి కొండంత అండగా నిలబడిందని, పేదల కోసం జైలు పాలైన చరిత్ర సీపీఐ(ఎం)అభ్యర్ధి భూక్యా వీరభద్రంనాయక్‌దన్నారు. సీపీఐ(ఎం) గెలుపుద్వారానే పోడు సాగు నిర్భాంధాలను ఎదుర్కోవచ్చాన్నారు. టీఆర్‌ఎస్‌, కూటమీ ఏది అధికారంలోకి వచ్చినా తిప్పలు తప్పవన్నారు. ఈనెల 13వ తేదిన భూక్యా వీరభద్రంనాయక్‌ నామినేషన్‌ కార్యక్రమాన్ని భారీగా తరలిరావాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కే.నాగేశ్వరరావు, మెరుగు రమణ, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు ముత్యాల సత్యనారాయణ, వజ్జా రామారావు, గుర్రం వెంకటేశ్వర్లు, కే.ఉమావతి, రేపాలకులు లాలయ్య, వడ్డూరి వీరబాబు, యడ్లపల్లి రాము, పోతర్ల నాగేశ్వరరావు, రేపాకుల వీరమ్మ, తోటకూరి జయమ్మ, ఆనసూరి సత్యనారాయణ, భూక్యా పూల్‌సింగ్‌, నూనవత్‌ గన్యా, అజ్మీర జ్యోతి, దండెంపల్లి వెంకన్న, ఎస్‌కె. సైదులు, మాలోత్‌ పడిత్యా, ఇమ్మడి నర్సయ్య, ఎర్రబెల్లి రాము, లక్ష్మయ్య, వేములపల్లి రమణ, మహాలక్ష్మి, మల్లికాంబ, నాగండ్ల శ్రీనివాసరావు, గలిగె కౌసల్య వీరబాబు, కల్తి రాంబాబు, మూతి వెంకటేశ్వర్లు, గలిగె చంటి, వల్లభినేని మురళి తదితరులు పాల్గొన్నారు.