మాదకద్రవ్యాలతో విద్యార్థులు జాగ్రత్త

కాకినాడ,డిసెంబర్‌14(జనం సాక్షి ):మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌ అధికారులు అన్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు వ్యక్తిగత శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రమాదాన్ని పసిగట్టి ఇటీవల అనేక ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించామని అన్నారు. విద్యార్తులు తమ భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని సూచించారు. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం వల్ల తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టకపోవడంతో కొందరు డ్రగ్స్‌కు అలవాటుపడి జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వివేకం విచక్షణతో సమాజంలో సంబంధాలు పెంచుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. మాదకద్రవ్యాల సంఘటనలు తమ దృష్టికి వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. డ్రగ్స్‌ దుష్ఫలితాలు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాలను గుర్తించి మసులకోవాలన్నారు.