మాదన్నపేట చెరువులోని వ్యర్ధాలను శుద్ధిచేసిన విజ్ డమ్ హై స్కూల్ ఎన్ సి సి కేడెట్లు

జనం సాక్షి: నర్సంపేట
జల కాలుష్య నివారణలో భాగంగా జలవనరులైన చెరువులు, నదులు, కాలువలను శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా 10. టి బెటాలియన్, వరంగల్ వారి షెడ్యూల్ ను అనుసరించి విజ్ డమ్ హై స్కూల్ ఎన్ సి సి కేడేట్ లు
మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న ప్లాస్టిక్ మరియు ఇతర హానికర వ్యర్ధాలను, చెరువు నీటిలో ఉన్న  ప్లాస్టిక్ బాటిల్స్ , గ్లాసులు, కవర్లను మరియు చెత్తా,చెదారాలను సోమవారం తొలగించడం జరిగినదని  విజ్ డమ్ హై స్కూల్ డైరెక్టర్ జావేద్  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యర్ధాల వల్ల కేవలం మనుషులకే కాకుండా జంతువులు, జలచరాలకు సైతం హాని చేకూరుతుందని చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడడం జరుగుతుందని వారు తెలిపారు. మన జలవనరులను మనమే శుద్ధి చేసుకోవాలనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం హర్షనీయమని, ప్రజలంతా ఒక్కటై తమ నీటి పరివాహ ప్రాంతాలను కాపాడుకోవాలని ఎన్సిసి కాడేట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలను, నివారణోపాయాలను వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్  వివరించారు. ఈ కార్యక్రమం తమకెంతో ఆనందంతో పాటు, స్ఫూర్తిని కలిగించిందని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జావేద్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ఏఎన్ఓ ప్రశాంత్ కుమార్, కుమారస్వామి, రాజు, స్వామినాథం  తదితరులు పాల్గొన్నారు