మాదిగ ఉద్యోగులు ఐక్యతా చాటాలి*
*యం ఈ యఫ్ జిల్లా అధ్యక్షుడు మెడపట్ల ధనుంజయ్.
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ లో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి జ్ఞాపిక, చాలువతో ఘనంగా సన్మానించారు*
*యం ఈ యఫ్ జిల్లా అధ్యక్షుడు మెడపట్ల ధనుంజయ్ మాట్లాడుతూ మాదిగ ఎంప్లాయీస్ ఐక్యంగా ఉంటూ జాతి శ్రేయస్సుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన రాజన్న, రాజేశ్వర్ లను జ్ఞాపిక చాలువతో ఘనంగా సన్మానించమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తు, విద్యార్థుల ఉన్నతికి దోహదం చేయాలని విజ్ఞప్తి చేశారు*
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన యం ఆర్ పి యస్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్, కిష్టన్న, శివన్న, సూర్య కాంత్, సుభాష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.