మానవీయతకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్
— పెరిగిన పింఛన్ తో దివ్యాంగులకు మరింత భరోసా
— మూడవ సారి ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తా
— ఎమ్మెల్యే కిశోర్ కుమార్
మోత్కూరు ఆగస్టు 24 జనం సాక్షి : ఆసరా పింఛన్ పథకంతో మానవీయతకు నిలువెత్తు నిదర్శనం గా సీఎం కేసీఆర్ నిలిచారని, పెరిగిన నూతన పించన్ తో దివ్యాంగులకు మరింత భరోసా కలిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ కేంద్రంలోని ఎల్.ఎన్. గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల నూతన ఆసరా పించన్ 1077 లు , కళ్యాణ లక్ష్మి 93 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల తలరాత మార్చిన సీఎం కేసిఆర్ పేరు చరిత్ర లో నిలిచి పోతుందన్నారు. పించన్ పెంచాలని ఎవరు అడగకున్నా వారి సమస్యలు తెలిసిన మహానేత వారిలో ఆర్దికంగా భరోసా నింపాడని కొనియాడారు. కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడపిల్లలకు వరం అని , ఆడపిల్లలకు సీఎం కేసిఆర్ మేనమామ ల అండగా నిలిచారని అన్నారు. ఆడపిల్ల కు పెళ్లి అయినాక నుండి గర్భం దాలిస్తే నుట్రిషన్ ఫుడ్ ,కాన్పు కోసం ప్రభుత్వ దవకనల్లో అన్ని సదుపాయాలు బిడ్డ కు జన్మనిస్తే కేసిఆర్ కిట్ ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారాన్నరు. ఇప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్యే తుంగతుర్తి ప్రజలు గెలిపించారని మూడవ సారి ఆదరించండి తుంగతుర్తి నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి 3 వ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ తీసుకుని మొదటి సరి రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వాలలో దౌర్భాగ్య పరిస్థితులు ఎదుర్కున్నామన్నారు. గత ప్రభుత్వం లు 7 గంటల కరెంట్ కూడా సరిగా ఇవ్వలేక పోయిందన్నారు. నేడు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. మూడవ సారి ఎమ్మెల్యే గా కిశోర్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ జి.విరారేడ్డి, ఇంఛార్జి డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జెడ్పీటీసీ లు గొరుపల్లి శారద, శ్రీరాముల జ్యోతి, ఎంపీపీ లు రచ్చ కల్పన లక్ష్మి నరసింహ రెడ్డి, దర్శనాల అంజయ్య,సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ కోనతం యాకూబ్ రెడ్డి,రైతు కో ఆర్డినేటర్ కొండ సోమల్లు, తహశీల్దార్ రాంప్రసాద్, ఎంపిడిఓ మనోహర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్,మోత్కూరు, అడ్డగుడురు బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడీ ప్రభాకర్ రెడ్డి,మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, మున్సిపల్ కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.