మానవ హక్కుల సమితి జిల్లా యూత్ అధ్యక్షుడిగా సమీర్ ఎంపిక
లింగాల జనం సాక్షి ప్రతినిధి
అంతర్జాతీయ మానవ హక్కుల సమితి నాగర్ కర్నూల్ జిల్లా యూత్ అధ్యక్షుడుగా లింగాల మండల కేంద్రానికి చెందిన ఎండి, సమీర్ ను నియమించారు. ఈ మేరకు మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంద జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ చేతుల మీదుగా గురువారం తెలంగాణ స్టేట్ బోర్డు కార్యాలయలో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ, సమీర్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు న్యాయం చేస్తానన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగకుండా చూస్తానని.. తనకు అప్పచెప్పిన బాధ్యతలను నెరవేరుస్తానని అన్నారు.
ఫోటో రైట్ అప్
నియామక పత్రాన్ని అందజేస్తున్న జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్