మాములు కోసం రౌడీ తల్వార్‌తో దాడి

1

– ప్రాణాలకు తెగించి కాపాడిన కస్టమర్‌

మంబాయి,ఆగస్ట్‌13(జనంసాక్షి):

ఆర్థిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్‌ సింగ్‌ ఠాకూర్‌ అనే ఓ మొబైల్‌ షాప్‌ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో షాపులో ఫోన్‌ కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుడ ఎం తో ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడ్డుకోవడమే కాకుండా తన చేతుల్లో బంధించి పక్కన ఉన్న వ్యక్తులకు అప్ప జెప్పాడు. ఆ వినియోగదారుడు సాహసం చేసి ఉం డకపోతే ఆ యజమాని చనిపోయేవాడు.అప్పటికే హ త్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండు సార్లు కత్తి తో దాడి చేయడంతో చేతికి, మెడకు గాయాల య్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలోకోలుకుంటు న్నాడు. ఈ దృశ్యం అంతా కూడా ఆ షాపు సీసీటీవి కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన వెనుక మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు తే ల్చారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలింపులు ప్రారంభించారు. అసలేం జరిగిం దంటే ఈ మధ్య రౌడీయిజం చేస్తూ కొందరు వ్యక్తులు రోజుకు వెయ్యి రూపాయలు తమకు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని, ఎవరైనా మామూళ్లు ఇస్తే వారి

షాపులు తగులబెడతామిన కూడా ఆ పోస్టర్లో హెచ్చరించారు. దీంతో ఎవరైనా వస్తే తనకుగానీ తన సోదరుడికి గానీ ఫోన్‌ చేయవచ్చని కూడా అందులో పేర్కొన్నాడు., ఈ నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడేవారు మొత్తం ఆరుగురు కలిసి రజ్నీష్‌ సింగ్‌ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ఐదురుగు కారులో కూర్చోగా ఒకరు మాత్రం కత్తితో వచ్చి సింగ్‌పై దాడి చేయగా ఓ వినియోగదారుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సింగ్‌ కృతజ్ఞతలు తెలపాడు. ఆ కస్టమర్‌ లేకుంటే తన సోదరుడు చనిపోయేవాడని సింగ్‌ సోదరుడు తెలిపాడు.