మారణ ¬మానికి ఐదేళ్లు..
న్యూఢిల్లీ/ముంబై, నవంబర్ 21 :మరో ఐదు రోజులైతే.. ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు. 166 మంది అసువులు బాసిన ఆనాటి ఉగ్రదాడిని తలచుకుంటే.. ముంబై వాసుల్లో భయాందోళన మొదలవుతుంది. ఆ నాటి ఉగ్రదాడిని భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడి ముష్కరులను ముట్టబెట్టారు. తొమ్మిది మందిని కాల్చి చంపి, కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. దేశంపై దండెత్తిన కసబ్‌కు నాలుగేళ్ల అనంతరం గట్టి బుద్ది చెప్పారు. న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను బుధవారం ఉదయం అమలు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైపై దాడి.. కసబ్ విచారణ, ఉరిశిక్ష అమలు వరకు జరిగిన పరిణామాలను ఒకసారి పరికిస్తే..కరాచీ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడ్డ పది మంది ఉగ్రవాదులు రద్దీ ప్రాంతాలపై దాడులకు పాల్పడ్డారు. 2008 నవంబర్ 26న కసబ్‌తో సహా మరో తొమ్మిది ముష్కరులు భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ¬మం సృష్టించారు. సాయంత్రం సమయంలో ముంబైలో అడుగు పెట్టిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులకు దిగారు. ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారం పలు ప్రాంతాల్లో మారణ¬మం సృష్టించారు. తాజ్ ¬టల్, ట్రైడెంట్, నారీమన్ హౌస్‌తో పాటు ముంబై రైల్వేస్టేషన్‌లో విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. 166 మందిని పొట్టన బెట్టుకున్నారు. వారి దాడుల్లో వందల మంది అమాయకులు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్‌తో పోలీసు ఉన్నతాధికారులు హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, కాంమ్టే తదితరులు కూడా దుర్మరణం చెందారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు మూడ్రోజుల పాటు వీరోచితంగా పోరాడి తొమ్మిది మందిని కాల్చి చంపాయి. కసబ్ ఒక్కడే పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సజీవంగా పట్టుబడ్డాడు.
ప్రత్యేక జైలు, కోర్టు ఏర్పాటు
కసబ్ కోసమే ప్రత్యేకంగా ముంబైలోని సర్ ఆర్థర్ రోడ్ జైలును ఏర్పాటు చేశారు. ముంబై దాడుల కేసును విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 2009 ఏప్రిల్ 15న ఆర్థర్ రోడ్ జైలులోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ట్రయల్ కోర్టు న్యాయమూర్తిగా ఎంఎల్ తహిల్యానీ నియమించింది. 15న ప్రారంభమైన విచారణ 13 నెలల పాటు జరిగింది. ఈ కేసులో కసబ్ తరఫున వాదించేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమించారు. ప్రాసిక్యూషన్ తరఫున ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ప్రముఖ పాత్ర పోషించారు. ముంబై దాడి ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు 11 వేల పేజీల భారీ చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. 3,192 పేజీల సాక్ష్యాధారాలను సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం 658 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఇందులో 30 మంది ప్రత్యక్ష సాక్షులు కసబ్‌ను గుర్తించారు. తనపై కసబ్ ప్రత్యక్షందా దాడి చేశాడని పదేళ్ల బాలిక కోర్టులో వాంగ్మూలమిచ్చింది. ఇద్దరు ఎన్‌ఎస్‌జీ కమాండోలు కూడా సాక్ష్యమిచ్చారు. దాడుల సమయంలో ఉగ్రవాదులు సంచరించిన తాజ్ ¬టల్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను ముంబై పోలీసులు కోర్టుకు అందజేశారు. మరోవైపు, అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు కోర్టుకు సాంకేతిక ఆధారాలు అందజేశారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారని జీపీఎస్ సహాయంతో కోర్టులో వివరించారు. ఈ విధంగా ఓ కేసులో ఎఫ్‌బీఐ అధికారులు భారత న్యాయస్థానానికి హాజరు కావడం ఇదే ప్రథమం.
బలమైన సాక్ష్యాలు..
కేసు దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అన్ని సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 658 మంది సాక్షులు వాంగ్మూలం ఇవ్వగా, కసబ్‌ను 30 మంది గుర్తించారు. ఈ దాడిపై 11 వేల పేజీలతో కూడాని భారీ చార్జిషీట్‌ను .. కోర్టుకు సమర్పించారు. 13 నెలల పాటు విచారించిన ట్రయల్ కోర్టు కసబ్‌కు మరణ శిక్ష విధిస్తూ 2010 మే 6న తీర్పు వెలువరించింది. అయితే, కింది కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థిస్తూ.. మరణ శిక్షను ఖరారు చేసింది. దీంతో కసబ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని విజ్ఞప్తి చేశాడు. అయితే, ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. దేశంపై దండెత్తడం అతిపెద్ద తప్పని, అందుకు మరణ శిక్ష సరైందేనని వెల్లడించింది. కింది కోర్టుల తీర్పులను సమర్థిస్తూ.. మరణశిక్షను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో క్షమాభిక్ష ప్రసాదించాలని కసబ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే, క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రణబ్ నిరాకరిస్తూ.. నవంబర్ 5న కసబ్ మెర్సీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ¬ం శాఖకు పంపించారు. ఉరిశిక్ష అమలు చేయాలని కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే 7న సంతకం చేశారు. నవంబర్ 21న ఉరి తీయాలని నిర్ణయించిన మహారాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే ఎరవాడ జైలుకు తరలించారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఉరి తీసిన అనంతరం.. 9.30 గంటల సమయంలో ఖననం చేశారు.
ముంబై దాడి.. ముఖ్యమైన ఘటనలు
నవంబర్ 26, 2008 : ముంబైపై ముష్కరుల దాడి,
నవంబర్ 28: పట్టుబడిన కసబ్
ఫిబ్రవరి 25, 2009: కసబ్‌పై చార్జిషీట్
ఏప్రిల్ 15, 2009: ఆర్థర్ జైలు రోడ్‌లో ట్రయల్ కోర్టు, ప్రారంభమైన విచారణ
డిసెంబర్ 16: పూర్తయిన విచారణ, తీర్పు వాయిదా
మే 6, 2010: కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు
అక్టోబర్ 10, 2011: ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు
ఫిబ్రవరి 14, 2012: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కసబ్