మార్కెట్లోకి మరో ‘స్మార్ట్’బ్రాండ్
న్యూదిల్లీ: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వచ్చేసింది. మీడియా స్ట్రీమింగ్ స్టిక్ ఉత్పత్తుల సంస్థ క్రియో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. క్రియో మార్క్ 1 పేరుతో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 19,999. ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్, సంస్థ వెబ్‌సైట్ నుంచి త్వరలోనే ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతినెలా కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లను అప్‌డేట్ చేసి విడుదల చేస్తామని సంస్థ చెబుతోంది.
ఫోన్ ఫీచర్లిలా..
* 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్
* 3 జీబీ రామ్
* 32 జీబీ అంతర్గత మెమొరీ
* 21 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* డ్యుయల్ సిమ్ సదుపాయం
* 4జీ సపోర్టింగ్