మార్కెట్‌లో కొనసాగిన ర్యాలీ
ముంబయి: శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో భారతీయస్టాక్ మార్కెట్‌లో లాభాల్లోకి దూసుకుపోయింది. సెన్సెక్స్ 168.99 పాయింట్ల ఆధిక్యంతో 19339.90 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 54.85 పాయింట్ల లాభంతో 5879.85 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లోని వాహన రంగానికి చెందిన షేర్లు తప్పి అన్నీ లాభాలతో ముగిశాయి. జిందాల్‌స్టీల్, బెల్, ఓఎన్‌జీసీ, ఐడీసీఎల్… తదితర కంపెనీలకు చెందిన షేర్లు మంచి లాభాలనార్జించాయి. కోల్ ఇండియా, హెచ్‌యూఎల్… తదితర కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి.