మార్కెట్‌లో పనిచేస్తున్న 1500 మంది కార్మికులకు దుస్తుల పంపిణీ

హుజురాబాద్‌ గ్రామీణం: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న సుమారు 1500 మంది కార్మికులకు మార్కెట్‌ కమిటీ ఛెర్మన్‌ తొమ్మేటి సమ్మిరెడ్డి దుస్తులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ సభ్యులు, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.