మార్కెట్ కమిటీ చైర్మన్ గా నెర్రే నర్సింలు, వైస్ చైర్మన్ గా రాజశేఖర్

రైతు లేనిదే రాజ్యం లేదు… సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్స్వాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం..
బాన్సువాడ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి):
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు తాము పండించిన పంటను విక్రయించలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, బిజెపి ప్రభుత్వం రైతు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఊపిరి ఉన్నంతవరకు రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మోటర్ మీటర్లు బిగించేది లేదని తెగేసి చెప్పారని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రైతులు సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర చెల్లించిన ఘనత తెరాస ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. నూతన పాలకవర్గ సభ్యులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ రాజశేఖర్, (బుల్లెట్ రాజు) శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. బొర్లం గ్రామస్తులు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ బుల్లెట్ రాజు, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, ఎజాస్, దాసరి శ్రీనివాస్, పాత బాలకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కామేశ్వర్, లక్ష్మా గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు నారాయణరెడ్డి, బోనాల సుభాష్, లక్ష్మీ శంకర్ గౌడ్, సరళ శ్రీనివాస్ రెడ్డి, నాయిని పద్మమొగులయ్య, శ్రావణి దేవేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ అధికారులు,ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.