మార్చ్ 8న పండుగ కాదు మహిళల పోరాట దీక్షా దినంమార్చ్ 8న పండుగ కాదు మహిళల పోరాట దీక్షా దినం* మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏండ్లుగా ఆమోదం లేదు* గ్యాస్ ధర పెంపు ప్రజా ద్రోహం* POW జిల్లా కార్యదర్శి బయ్యా శారద

 టేకులపల్లి,మార్చి 2( జనం సాక్షి ): అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంను ప్రభుత్వాలు, అధికార పార్టీలు ఉత్సవంగా,పండుగలా మార్చి వేస్తున్నారని ఇది సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా లభించిందని దీక్షాదినంగా జరిపి ప్రతినపూణే సందర్భం అని ప్రగతిశీల మహిళా సంఘం(POW)జిల్లా ప్రధాన కార్యదర్శి బయ్యా శారద పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా బద్దుతండాలో గురువారం సర్పంచు భూక్యా చిన్ని అద్యక్షతన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శారద మాట్లాడుతూ మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గ్యాస్ ధరలను 300 నుండి 1150 రూపాయలకు పెంచి దేశ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను,పెట్రోలు,డీజిల్ ధరలను పెంచి ప్రజల బ్రతుకులు కడుభారంగా చేశారని అన్నారు.మోడి,కెసిఆర్ లు ఓకే తాను గుడ్డలని అణిచివేత, దాడులు,అత్యాచారాలు,హత్యల యడల పాలకుల వైఖరి ఒకే విధాలా ఉందని అన్నారు.27 ఏండ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో తొక్కిపెట్టడానికి అధికార,ప్రతిపక్ష,పాలకవర్గ పార్టీలు ఉన్నాయని తెలిపారు. 2023లో ‘మహిళాభివృద్ధిని దెబ్బతీస్తూ,స్త్రీ పురుష అసమానత్వాన్ని పెంచిపోషించే బీజేపీ భ్రాహ్మణీయ,పితృస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సదస్సు అనంతరం మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై మండల కేంద్రంలో పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.ఈ సదస్సు లో  పి ఓ డబ్ల్యు  జిల్లా గౌరవాధ్యక్షులు నోముల కళావతి జిల్లా సహాయ కార్యదర్శి మోకాళ్ల సుగుణ,మండల అధ్యక్ష, కార్యదర్శులు తొటకూరి చిట్