మావోయిస్టులకై అడవులను జల్లెడ

 

మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు:మహబూబాద్ డిఎస్పి సదయ్య

కొత్తగూడ సెప్టెంబర్ 6 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో డిఎస్పి సదయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు ప్రజాదరణ కోల్పోయి మకాం ను ఛత్తీస్గఢ్ కు మార్చారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుండి మావోయిస్టు లు లేకపోవటం వలన ప్రజలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిర్భందం గాని,పోలీసుల నుండి ఏమైనా అన్యాయం గాని జరిగిందా….గత 15 సంవత్సరాల క్రితం మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం లో ఉన్నపుడు అరాచకాలు సృష్టించారు.డబ్బులు వసూలు చేస్తూ ఇవ్వని వారిని ఊచకోత కోశారని,రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పోలీస్ పకడ్బదీగా వ్యూహాలతో ప్రజల సహకారం తో తరిమికొట్టడం జరిగింది.తెలంగాణ లో ప్రజల ముద్దతూ కోల్పోయిన మావోయిస్టులు చతిస్గడ్ బాట పట్టగా అక్కడి మావోయిస్టు లకు,తెలంగాణ మావోయిస్టుల మద్య వైరం ఏర్పడింది.తెలంగాణ కోసం ఏర్పడిన మావోయిస్టు కమిటీలు,చతిస్గడ్ లో తల దాచుకోవటం వలన చతిస్గడ్ మావోయిస్టులకు దెబ్బ తగులుతుందని వారి మధ్య వివాదం ఏర్పడి తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు వారి ఉనికిని చాటుకోవటానికి నాయకత్వం సురక్షితంగా ఉండి క్రింది క్యాడర్ మావోయిస్టులను పంపి మేము ఇంకా ఉన్నామని ప్రజలకు తెలపటానికే వారి ఉనికిని చాటుతూ క్రింది క్యాడర్ మావోయిస్టుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.మావోయిస్టుల వల్ల ఒరిగిందేమీ లేదు.15 సంవత్సరాలుగా ప్రజలు ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సాధించుకున్నారు.పల్లెలన్ని ప్రశాంతంగా ఉన్నాయి.ఇప్పుడు సామాన్య ప్రజలకు మావోయిస్టు అవసరం లేదని తెలిసి కూడా మావోయిస్టు తమ ఉనికి కోసం తెలంగాణలో దిగువ క్యాడర్ ను ప్రవేశపెట్టి అక్కడక్కడ ఉన్న మాజీ మిల్టెండ్ లను వాడుకుంటూ అడవుల్లో తిరుగుతూ తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.కొత్తగూడ,గంగారం,గూడూరు మండలాలతో పాటు బయ్యారం మండలాల ప్రజలు దిగువ స్థాయి మావోయిస్టులు వస్తే వారికి మావోయిస్టు పెద్ద క్యాడర్ సురక్షితంగా ఉండి మిమ్మల్ని బలి పశువు చేసే విధంగా ఇక్కడకు పంపుతున్నారు.మీరు ప్రభుత్వం ముందు లొంగిపోండి అని గీత బోధ చేసి వారిలో మార్పు తీసుకురావాలని అదేవిధంగా ప్రజలకు మావోయిస్టుల అవసరం లేదని తెలియజేయవలసిందిగా కోరారు.గత సంవత్సరం తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు అధినాయకత్వం సురక్షితంగా ఉండి దిగువ స్థాయి మావోయిస్టులను పంపించగా వారిలో దాదాపు పది మంది చనిపోవడం జరిగింది.మావోయిస్టు మీ గ్రామాల్లో గాని సమీప అడవుల్లో సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు.అలాగే ఎవరైనా తెలిసి తెలియక సహకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రజలకు హెచ్చరించడం జరిగింది.ప్రజలు,రాజకీయ నాయకులు భయపడాల్సిన అవసరం లేదని మీయొక్క ప్రాణాలకు పోలీస్ ల ప్రాణాలను అడ్డు వేస్తామని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గూడూరు సిఐ యాసిన్,స్థానిక ఎస్సై నగేష్,గంగారం ఎస్సై ఉపేందర్,కొత్తగూడ ఏఎస్ఐ శోభ రాణి తదితరులు పాల్గొన్నారు.