మావోయిస్టులను వెంబడిరచి పట్టుకున్న పోలీసులు
ఖమ్మం : మావోయిస్టులను వెంబడిరచి ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళ్తున్న మావోయిస్టులను ముందస్తు సమాచారంతో పోలీసులు వెంబడిరచారు. ఈ క్రమంలో పాల్వంచ వద్ద మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డవారిలో ఉత్తర తెలంగాణ కార్యదర్శి చంద్రన్న భార్య సక్కుబాయి అలియాస్ రాధ ఉన్నట్లు సమాచారం.