*మావోయిస్టుల ప్రలోభాలను నమ్మకండి*

పలిమెల ఎస్సై అరుణ్*
*పలిమెల, సెప్టెంబర్ 25 (జనంసాక్షి)*  మండలంలోని వెంచంపల్లి మరియు నీలంపల్లి గ్రామాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్  గ్రామస్తులతో మాట్లాడుతూ మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నందున, ఎవరైనా కొత్త అనుమానిత వ్యక్తులు మరియు సంఘ విద్రోహక వ్యక్తులు గ్రామంలోకి వస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని, అలాంటి వారికి  ఆశ్రయం కల్పించిన లేదా సహకరించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా అందరు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని తెలియజేసారు. మావోయిస్టులు గోదావరి నది దాటే అవకాశం ఉన్నందున ఫెర్రీ పాయింట్లను తనిఖీ చేశారు.
అదేవిధంగా గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలు, వరదల కారణంగా జ్వరం, మలేరియ, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను పెద్దగా చదివించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్ గ్రామ ప్రజల గురించి అడగ్గా
ప్రజలు ఇక్కడ వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఎస్సై అరుణ్ మాట్లాడుతూ మావోయిస్టుల సిద్ధాంతాల వల్ల  ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు.
*వాలీబాల్ పోటీలను సద్వినియోగం చేసుకోండి*
మహదేవపూర్ సర్కిల్ పరిదిలో జరిగే వాలీబాల్ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై అరుణ్ యువతకు పిలుపునిచ్చారు. మండలంలోని ముకునూరు, బోడాయిగూడెం మరియు లెంకలగడ్డ గ్రామాలలోని యువతకు వాలీబాల్ కిట్లను ప్రధానం చేసారు. సోమవారం నుండి మహదేవపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జరిగే పోటీలలో పాల్గొని విజయం సాధించాలని యువతకు దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో సివిల్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.