మావోయిస్టు మాజీ నేత చంద్రన్నపై దాడి కేసు నమోదు
ముత్తారం:మండలం మచ్చుపేటలో మావోయిస్టు మాజీ నేత బందారపు మల్లయ్య అలియాస్ చంద్రన్న అదే గ్రామానికి చెందిన చింతల వీరేశం (43) పైవ్యక్తిగత కక్షలతో సోమవారం దాడి చేశారని ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు పెద్దపల్లిలో నివసిస్తున్న వీరేశం గ్రామంలోని ఓ శుభకార్యానికి రాగా గతంలో జరిగిన వ్వక్తిగత వివాదాలను దృష్టిలో పెట్టుకొని చంద్రన్న అతడిపైదాడిచేశారు. 13ఏళ్ల కిందట చంద్రన్న సోదరుడు నర్సయ్యను హతమార్చిన కేసులో వీరేశం నిందితుడని, సోదరుని చంపడంలో ఎవరెవరి హస్తం ఉందో చెప్పాటని దాడి చేశాడని ఎస్సై పేర్కొన్నారు. వీరేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రన్నపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్‌కుమార్ చెప్పారు.