మాస్కో చేరుకున్న ప్రధాని

5
మాస్కో,డిసెంబర్‌23(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో రష్యా రాజధాని మాస్కో చేరుకున్నారు. సావత్సరిక చర్చల్లో భాగంగా రెండు రోజులపాటు ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ తో ప్రధాని భేటీ కానున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చ నిమిత్తం చేస్తున్న తొలి రష్యా పర్యటన. గతంలో 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రష్యా వెళ్లిన మోదీ ప్రస్తుతం ప్రధాని పదవిలో అక్కడికి వెళ్లారు.భారత్‌, రష్యా మధ్య ఆర్థిక, శక్తి, రక్షణ సంబంధమైన అంశాలకు సంబంధించి అగ్రనేతలు ఒప్పందాలు చేసుకోనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్‌ ఇతర రంగాల్లో పరస్పర ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు చర్చిస్తారు. రష్యా వ్యాపారవేత్తలతో కూడా ప్రధాని సమావేశం అవుతారు.