‘మాస్టర్ సోషల్ వర్క్’పై పీజీ కోర్సు ప్రారంభం
నిజామాబాద్, జూలై 18: నగరంలో ఉన్న ఉమెన్స్ కళాశాలలో మొట్టమొదటిసారిగా మాస్టర్ సోషల్ వర్క్(ఎమ్‌ఎస్‌డబ్ల్యు) పిజి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్ కె.విజయకుమారి తెలిపారు. నగరంలోని ఉమెన్స్ కళాశాలలో బుధవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఉమెన్స్ కళాశాలను 1965లో స్థాపించడం జరిగిందని, ఇప్పటివరకు ఇంటర్ , డిగ్రీ కళాశాలలనే నిర్వహించడం జరిగిందన్నారు. ఉమెన్స్ కాలేజ్ యాజమాన్యం, ఓయూ ప్రోత్సాహంతో పిజి కాలేజిని మహిళల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పిజి కాలేజిలో 46 సీట్లు మహిళ విద్యార్థినిలకే కేటాయించడం జరిగిందన్నారు. ఈ పిజి కాలేజిలో హాస్టల్ వసతి, ప్లే గ్రౌండ్, లైబ్రెరీ విశాలంగా ఉన్నాయన్నారు. ఈ ఎమ్‌ఎస్‌డబ్ల్యు కోర్సు వల్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, ఇతరేతర ఉద్యోగాలు అధికంగా లభిస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థినిలకు స్కాలర్‌షిప్ అందించడం జరుగుతుందన్నారు. టెక్స్ట్‌బుక్స్ కొన్నామని, ఈ కాలేజి ఉపాధ్యాయులందరూ యుజిసి స్కేల్స్ పొందుతూ ఉన్నతస్థాయిలో ఉన్నారని అందులో పిజికి ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న వసుంధర కూడా ఈ కాలేజీ విద్యార్థినియే అని ప్రిన్సిపల్ తెలిపారు. భిక్కనూర్‌లో ఎమ్‌ఎస్‌డబ్ల్యు కోర్సు ఇప్పటికే ఉందని, అది కోఎడ్యుకేషన్ అన్నారు. ప్రస్తుతం ఎమ్‌ఎస్‌డబ్ల్యు కోర్సును ప్రవేశపెడుతున్నామని, వచ్చే సంవత్సరం మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టనున్నామని వసుంధర తెలిపారు. మద్యాన్ని నిషేధించాలి