మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 15 మంది విద్యార్థులు డిబార్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 15 మంది విద్యార్థులు డిబారయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అక్రముల్లాఖాన్ తెలిపారు. రెబ్బెన జెడ్పీఎస్‌ఎస్‌లో నలుగురు, తానూర్ జెడ్పీఎస్‌ఎస్‌లో ఇద్దరు, ముథోల్ జెడ్పీఎస్‌ఎస్-బి సెంటర్‌లో, ఆసిఫాబాద్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో, కెరమెరి జెడ్పీఎస్‌ఎస్‌లో, బెల్లంపల్లి యువసంఘటన హైస్కూల్‌లో ఒక్కొక్కరు, దండేపల్లి జెడ్పీఎస్‌ఎస్-ఏ సెంటర్‌లో ఐదుగురు డిబారయ్యారు. మామడ, తానూర్ జెడ్పీఎస్‌ఎస్ కెరమెర జెడ్పీఎస్‌ఎస్ ఒక్కో ఇన్విజిలేటర్‌ను, దండేపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు.