మాస్‌ కాపీయింగ్‌ నిరోధంతో తగ్గిన ఫలితాలు

చర్యను సమర్థించుకున్న సిఎం యోగి
లక్నో,మే2( జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో 2017-2018 విద్యా సంవత్సరంలో  పబ్లిక్‌ పరీక్షల్లో 72శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాన్ని యుపి సిఎం యోగీ ఆదిత్యానాథ్‌ సమర్ధించుకున్నారు. తమ రాష్ట్రంలో పరీక్షల్లో చీటింగ్‌ చేయడాన్ని అరికట్టిందేకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పడిపోయిందని, దీంతో పరీక్షల్లో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకొచ్చామని సిఎం వ్యాఖ్యానించారు. పక్కాగా పరీక్షలు నిర్వహించడం వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు.  పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ నివారణా చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో స్పెషల్‌
టాస్క్‌ఫోర్స్‌ను, సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశామని, పోలీసులు కూడా విద్యార్థులు స్వేచ్ఛగా, మరింత ఉన్నతంగా పరీక్ష రాసేందుకు సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వలనే 72 శాతం మంది విద్యార్థులు ఈ ఏడాది ఎలాంటి చీటింగ్‌లకు పాల్పడకుండా ఉత్తీర్ణులయ్యారని హర్షం వ్యక్తం చేశారు.