మా తల్లిదండ్రులకు పే స్కేల్ అమలుపరచండి.
-నిరాహారదీక్ష లో పాల్గొన్న వారి పిల్లలు
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్07( జనంసాక్షి): దసరా పండుగ సందర్భంగా తమకు వేతనాలు అందక పండుగ సంబరాలకు దూరంగా ఉన్నామని రెవెన్యూ గ్రామ సహాయకుల పిల్లలు అన్నారు. శుక్రవారం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న నిరహార దీక్షలో వారి పిల్లలు పాల్గొన్నారు.75 రోజులుగా వీఆర్ఏలు టెంటు వేసుకొని తహసిల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యొక్క తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూలో సేవలు అందిస్తున్నారని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ అందజేస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ తాత పే స్కేల్ అమలుపరచాలని ప్లకార్డ్ లు ప్రదర్శించారు . ఈ సందర్భంగా వీఆర్ఏల పిల్లలు వచ్చి దీక్ష శిబిరంలో వారి తల్లిదండ్రులతో నిరాహార దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో సంతోష్ వాళ్ళ బాబు-తృశ్నిత్ నందా పాప -తృషితా, B శేఖర్ వాళ్ళ బాబు-రిక్కీ, B రజిత వాళ్ళ పాప-శ్రీ అభిజ్ఞ వర్ధిని, షహనాజ్ వాళ్ళ బాబు అబ్బు బకర్ అలీ, నారాయణ వాళ్ళ మనుమరాలు ఝాస్మిని పలువురు పిల్లతో ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు.
Attachments area