*మా పల్లెటూరును కొంచెం పట్టించుకోండి సార్*

*=మౌలిక వసతులు లేని మారుమూల పల్లెటూరు*
*=ఆ పల్లెటూరులో అభివృద్ధి శూన్యం*
=============================
మద్దూర్ (జనంసాక్షి):నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని  గ్రామపంచాయతీల ఆవరణలో ఉన్న చిన్న పల్లెటూర్లు అభివృద్ధికి అమెడ దూరంలో ఉన్నాయి. రెనివాట్ల గ్రామపంచాయతీలో ఉన్న రాళ్ళబావి ప్రాంతం ఏర్పాటు అయ్యి సుమారుగా 2 తరాలు కావొస్తోంది. రెనివట్ల గ్రామ శివారులో ఉన్న2 కి.మీ రాళ్ళబావి పల్లెటూరులో కనీస మౌలిక వసతులు లేకుండా ప్రజల నివాసం ఉంటున్నారు. ఈ గ్రామ శివారు వారు ఇక్కడికి తమ పొలాల్లో వ్యవసాయం చేసుకోవడానికి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.ఈ గ్రామంలో 400 జనాభా మరియు 180ఓటర్లు కలిగిన ప్రాంతం.ఈ ప్రాంతానికి 1987 సంవత్సర కాలంలో మొట్ట మొదటగా మట్టిరోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు అదే మట్టి రోడ్డుతో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరిగినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నివసించడం నూటికి 90% ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతాయి.ఈ పరివాహక ప్రాంతంలో ప్రజల కోసం ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు కనీస మౌళీక వసతులు (రోడ్డు,ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం,విధి దీపాలు) వంటివి కూడా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని ప్రాంత వాసుల ఆరోపిస్తున్నారు.స్వాతంత్రం వచ్చి75 సంవత్సరాలు పూర్తి చేసుకోని.సాంకేతిక, పరిశ్రమ రంగంలో ఇతరత్రా అంశాల్లో దూసుకుపోతున్న తరుణంలో కనీస మౌలిక వసతులు లేని పరివాహక పల్లెటూర్లు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతానికి బీటీ రోడ్డు, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి సెంటర్, వెంటనే ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు..
Attachments area