మిగతా మంత్రులను తొలగించాలి: బండారు దత్తాంత్రేయ
హైదరాబాద్, జనంసాక్షి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మత్రులు జారీచేసిన 26 జీవోలు న్యాయబద్దమైనవే అయితే వారు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. 26 జీవోలను వెంటనే రద్దుచేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసహాయం చేయాల్సిన అవసరం ఏంటని బండారు దత్తాత్రేయ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దత్తాత్రేయతో పాటు బీజేపీ నేతలు అక్ష్మీనారాయణ, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లతో పాటు పలువురు నేతలు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు.