మిడిమిల్స్ కార్మికుల
వేతనాలు వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ముందు ధర్నా… నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్ 19(జనంసాక్షి); గత ఐదు నెలలుగా మిడిమిల్స్ కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని అలాగే గత మూడు నెలలుగా రావాల్సిన గుడ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జన్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నెలలుగా మిడిమిల్స్ కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు అలాగే మిడిమిల్స్ వారికి రాష్ట్ర ప్రభుత్వము డైరెక్టుగా గుడ్ల పంపిణీ చేయాలని విన్నవించారు.గత మూడు నెలల నుండి గుడ్ల బిల్లు రాలేదని ,మిడిమిల్స్ కార్మికులు రోజురోజుకు అప్పుల బాధతో బాధపడుతున్నరన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికుల కష్టాలు తీర్చిదిద్ద లన్నారు.లేని పక్షంలో భవిష్యత్తు లో సమ్మె చేయడానికి సిద్ధమన్నారు.ఈ కార్యక్రమంలో మిడిమిల్స్ కార్యదర్శి చక్రపాణి,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.