మినీ వ్యాన్ బోల్తా : పలువురికి గాయాలు
నెన్నెల : ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా వసతిగృహం సమీపంలో మినీవ్యాన్ బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు బీమనపల్లి మండలం జిల్లెడ గ్రామంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో ఉన్న కూలీలుగా గుర్తించారు. వారు బెల్లంపల్లి మార్కెట్‌కు వెళ్లి వివిధ సరకుఉల కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. మరో పదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు బెల్లంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.