మిన్నంటిన గౌరమ్మ పెళ్లి సంబరాలు

కరీంనగర్‌ సాంస్కృతికం,న్యూస్‌టుడే: గౌరమ్మ పెళ్లి సందర్భంగా మంగళవారం నగరంలోని మార్వాడీ మందిరంలో రాజస్థానీ మార్వాడీల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా మహిళలు దాండియా, ఆటలు, పాటలతో సందడి చేశారు.కోలాటాలు,నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గీతావ్యాన్‌,వూర్మిలా ముందడ, వూర్మిలా బియాని, ప్రియాంక ముందడ, కల్పనా పంపాలియా,రాజస్థానీ మార్వాడీ మహిళలు పాల్గొన్నారు