మిర్యాలగూడలో క్లియో స్పోర్ట్స్ క్రికెట్ స్టేడియం
ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
హాజరైన మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్
మిర్యాలగూడ, జనం సాక్షి.
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో క్లియో
స్పోర్ట్స్ అరేనాలో క్రికెట్ స్టేడియంను ఆదివారం మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఎమ్మెల్యే భాస్కరరావు మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారులు తన వ్యక్తిగత ప్రతిభను చూపి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి క్రికెట్ జట్టుకు ఎంపీక కావాలన్నారు. చైర్మన్ భార్గవ్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ స్థాయిలో క్రికెట్ క్రీడాకారులకు స్టేడియం ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ( బిఎల్ఆర్) మాట్లాడుతూ క్రికెట్ పోటీలలో క్రీడాకారులు సత్తా చాటాలని, క్రికెట్ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగి మిర్యాలగూడకు పేరుతీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉదయ్ భాస్కర్, జానీ, ప్రముఖ న్యాయవాది ఏచూరి శ్రీనివాస్, డాక్టర్ గౌరు నవీన్, క్లియో అరేనా స్టేడియం ఎండి ఏచూరి శ్రీ హర్ష, నేతి వెంకటేశ్వర్లు, బ్యాట్మెంటన్, క్రికెట్, కోచ్ లో రామకృష్ణ, కావలి వెంకన్న, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, ఎజాస్ హాష్మి, బిఆర్ఎస్ నాయకులు రేపాల రమేష్ అల్లాని రమేష్, దినేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్దు నాయక్, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు, సుమన్, అతిక్, పురం వెంకట్, బండ కృష్ణారెడ్డి, రాజశేఖర్ ఏనుగుర్తి రవి, మునీర్, మనీ కుమార్, గౌస్, దుర్గా, ఫయాజ్ తౌఫిక్, శివ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎండి శ్రీహర్ష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు, చైర్మన్ భార్గవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ ఆర్ కు అతిథులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు