మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర.

మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర

మిర్యాలగూడ, అక్టోబర్ 17.జనం సాక్షి.

మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ కే కాంగ్రెస్ అధిష్టానం కేటాయించాలని కోరుతూ మంగళవారం ఉదయం 7:30 గంటలకే నియోజకవర్గ కాంగ్రెస్ నేత, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆధ్వర్యంలో దామరచర్ల మండలం రాళ్లవాగు తండా రాగ్య నాయక్ స్తూపం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమైయి, మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ మీదుగా హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, శ్రేణులు అభిమానులు, భారీ సంఖ్యలో “సేవ్ కాంగ్రెస్” “సేవ్ మిర్యాలగూడ” నినాదంతో ప్లే కార్డులు చేతబూని, వేలాది మంది భారీ ర్యాలీతో పాదయాత్రలో ముందుకు వెళ్లారు.పొత్తుల భాగంగా సిపిఎం కు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారని, వస్తున్న పుకార్లను కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు, నమ్మ వద్దన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నేటి వరకు టికెట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కావాలనే కొందరు కాంగ్రెస్ క్యాడర్ ను ప్రలోభాలకు గురి చేయడం సరైంది కాదన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగాఉందని,మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామన్నారు. రాళ్ల వాగు తండా, కొండ్రపోల్, కొత్తగూడెం కృష్ణాపురం, గూడూరు గ్రామాల వద్ద దారి పొడవునా మహిళలు హారతులిచ్చి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు.. బాన సంచా కాలుస్తూ పూలు చల్లుతూ బిఎల్ఆర్ భారీ ర్యాలీ పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు.
పాదయాత్ర భారీ ర్యాలీలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయo ఉపేందర్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, మహేందర్ రెడ్డి, జగ్గారెడ్డి, పుట్టల సునీత కృపయా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలే శ్రీనివాస్, అర్జున్, ఎంపీటీసీ బెజ్జం సాయి, ఇజ్రాయిల్, సర్పంచులు కిరణ్, అంజిరెడ్డి, శ్రీనివాస్, రాంబాబు, తోపాటు రామ లింగయ్య యాదవ్, సజ్జల రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ షేక్ జిందా, శంకర్ రెడ్డి, గార్లపాటి శేఖర్ రెడ్డి, బాలాజీ నాయక్, ఉబ్బే పల్లి కాశయ్య, మచ్చ వెంకన్న,మున్సిపల్ కౌన్సిలర్లు, కొమ్ము శ్రీనివాస్, దేశిడి శేఖర్ రెడ్డి, శాగ జయలక్ష్మి, నాగలక్ష్మి, అనిత, యాదగిరి రెడ్డి, జానీ, రామకృష్ణ, రుణాల్ రెడ్డి, మొయిజ్,మాజీ సర్పంచ్ నాగు నాయక్, దండ ప్రభాకర్ రెడ్డితో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండి అజరుద్దీన్, సిద్దు నాయక్, పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రవీందర్ రెడ్డి, పిదంబర్ రెడ్డి, అబ్దుల్లా, మస్తాన్, హలీం, గుండు నరేందర్, పాతూరి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, అభిమానులు,బి ఎల్ ఆర్ బ్రదర్స్ పెద్ద సంఖ్యలో హాజరైనారు.