మిర్యాలగూడ పట్టణంలో ఆర్ &బి శాఖ నిధుల ద్వారా పలు రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఆర్&బి  శాఖ నిధుల ద్వారా మొత్తం 9 కోట్ల 6 లక్షల రూపాయలు
మిర్యాలగూడ, జనం సాక్షి.
 పట్టణాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కరరావు అన్నారు.  ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో ఆర్ అండ్ బి  శాఖ నిధులతో 5 కోట్ల 10 లక్షల రూపాయలతో 13 కిలోమీటర్ల మేర నందిపహాడ్ బైపాస్ నుండి ఐలాపురం వరకు, అద్దంకి హైవే నుండి గోగువారిగూడెం వయా అన్నపురెడ్డి గూడెం వరకు బి.టి రోడ్ నిర్మాణానికి, మరియు 3 కోట్ల 96 లక్షల రూపాయలతో 2.2 కిలోమీటర్ల అద్దంకి హైవే (రవీంద్ర నగర్) నుంచి చిల్లాపురం రైల్వే ట్రాక్ వరకు బి.టి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ  మిర్యాలగూడ మున్సిపాలిటీకి మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ ప్రకటించిన హామీల మేరకు  కొనసాగుతున్నాయని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్,  ఆర్ అండ్ బి ఈ ఈ  నరేందర్ రెడ్డి,  డి .ఈ  గణేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు  అన్నభిమోజు నాగార్జున చారి, నూకల హనుమంత్ రెడ్డి, కౌన్సిలర్లు కర్నే ఇందిరమ్మ-గోవింద్ రెడ్డి, షైక్ జావీద్, ఉదయ భాస్కర్, మలగం రేమేష్, వంగాల నిరంజన్ రెడ్డి, గొంగిడి సైదిరెడ్డి, పత్తిపాటి నవాబ్, పునాటి లక్ష్మీనారాయణ, బాసాని గిరి, రామచంద్రు నాయక్, రేణు బాబు, యర్రమల్ల దినేష్, పాలరపు సత్యనారాయణ, వంశీ, ఏ ఈ  లు తదితరులు పాల్గొన్నారు.