మిల్లులో ఉన్న దాన్యంను మిల్లింగ్ చేసి ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి.

దాన్యంను పరిశీలించిన జులకంటి
 
మిర్యాలగూడ

. జనం సాక్షి 

మిల్లులలో నిలువ ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వ వెంటనే బియ్యాన్ని సేకరించాలని మాజీ ఎమ్మెల్యే జూలక రంగారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం మండలంలోని కృష్ణాపురం వద్ద ఉన్న శివరామకృష్ణ రైస్ మిల్లును సందర్శించి మిల్లులో నిల్వ ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యాసంగి వానకాలం ఈ  యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఐ కే పి ద్వారా కొనుగోలు చేసి మిల్లింగ్  కోసం మిల్లులకు ధాన్యం తరలించారన్నారు. బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మిల్లింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు. బలవంతంగా మిల్లులో ధాన్యం దిగుమతి చేశారని వాటిని నిల్వ చేసేందుకు మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిఎంఆర్ బియ్యం సేకరణ నిలిచిపోయి 43 రోజులు గడుస్తున్నాయని దాని కారణంగా కేవలం సీఎంఆర్ చేసే మిల్లులు సుమారు 1500 పైగా మిల్లులు మూతపడ్డాయని వాపోయారు దాని ఫలితంగా సుమారు లక్ష 50 వేల మంది హమాలీలు కార్మికులు ఉపాధి కోల్పోయారని వాపోయారు. మిల్లుల్లో నిలువ ఉన్న దాన్యం అకాల వర్షంతో తడిసిపోయి సుమారు 10 శాతం డ్యామేజీ అయిందని తెలిపారు. ఆ డ్యామేజీ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మిల్లులపైనే భారం మోపుతుందని ఆరోపించారు. ధాన్య నిలువ చేసుకున్నందుకు గోదాములు లేక ఆరుబయట నిల్వ చేసి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ధాన్యం తడిసి మొలకెత్తిందని, చాలాకాలం నిలువ ఉండడంవల్ల ధాన్యం డామేజ్ అవుతుందని పేర్కొన్నారు. గతంలో మిల్లింగ్ చేసిన చార్జీలు కూడా కోట్లలో పెండింగ్ ఉందని  తెలిపారు. బిల్లింగ్ చార్జీలు రాక మిల్లర్లు నష్టాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మిల్లులలో ఉన్న ధాన్యానికి మిల్లింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చి బియ్యం సేకరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన బియ్యం కోటాను వెంటనే సేకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన కోటాను తీసుకొని పేదలకు   పంచాలని, ఆపై ఉంటే బహిరంగ వేలం పెట్టి అమ్మాలని డిమాండ్ చేశారు. మిల్లులలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని, మూత పడ్డ మిల్లులను తెరిపించి రైస్ మిల్లర్స్, హమాలి కార్మికులకు ఉపాది కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిల్లు యజమాని వెంకట రత్నం, సిపిఎం రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు రవి నాయక్,  జగదీష్ చంద్ర, ఆయూబ్, క్రిస్జ్ఞ,శ్రీనివాస్, గోపి, లతీఫ్, లింగయ్య, పథాని శ్రీను,వెంకన్న, విజయ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు