మిషన్ భగీరథ పైపులైన్ లీక్
నిజామాబాద్,సెప్టెంబర్28 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామ సమిపన జాతీయ రహదారి 44 కు అనుకోని ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ లికేజ్ అయింది. దాంతో జాతీయ రహదారిపై నీరు చిల్లుతుండడంతో రాకపోకలు సాగించే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పరిసర ప్రాంతాలలో మిషన్ భగిరథ పైప్ లైన్ లకు లీకేజిలు ఎర్పడుతున్నా అధికారుల పర్యవేక్షణ ఉండట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకే అదికారుల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని వారంటున్నారు.