మిషన్ భగీరథ గుంతలు కాంక్రీట్ తో పూడ్చాలని వినతి             

మిషన్ భగీరథ గుంతలు కాంక్రీట్ తో పూడ్చాలని వినతి                                                            హుజూర్ నగర్ జూన్ 2 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణ ప్రగతిలో భాగంగా మిషన్ భగీరథ గుంతలు త్వరగా కాంక్రీట్ తో పూడ్చాలని అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్ గురువారం హుజూర్ నగర్ పట్టణ మున్సిపాలిటీ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశానన్నారు. ఈ సందర్భంగా కోలపూడి యోహాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహోత్సవ కార్యక్రమం పట్టణ ప్రగతిలో భాగంగా మిషన్ భగీరథ పైప్లైన్ కొరకు తీసిన గుంటలను, ఇంటింటికీ నల్ల కలెక్షన్ కొరకు పగులగొట్టిన సిసి రోడ్లు గాడులను పూడ్చాలని అన్నారు. ఈ మిషన్ భగీరథ గుంటల వలన వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ గుంటల వలన మురుగునీరు ఆగి దుర్వాసన వచ్చి, ఈగలు, దోమలు విపరీతంగా వస్తున్నాయి అని వీలైనంత త్వరలో ఈ పనులు పూర్తిచేయాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి పనులు ప్రారంభిస్తామని తెలిపారన్నారు.