మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,

కోడేరు (జనం సాక్షి) 20
 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో మీ కోసం మీ ఎమ్మెల్యే, కార్యక్రమంలో భాగంగా మొదటగా ఎమ్మెల్యే గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి  రామాలయం శ్రీ క్రిష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామంలోని అన్ని వీధులు  ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, వారితో మమేకమై ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ఏ ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అని అడిగి తెలుసుకుంటున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో  పల్లె ప్రకృతి వనంను సందర్శించి గ్రామంలో ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు  తీసుకోవాలన్నారు.
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
 విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని,నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు,పిల్లలకి విద్యతో పాటుగా ఆట పాటలు,మంచి పౌష్టిక ఆహారం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
స్థానికంగా ఉన్న డ్రైనేజీ, పరిసరాల పరిశుభ్రత,కరెంట్,నీటి ఇళ్ళ స్థలాలు వంటి సమస్యలపై తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
అధికారులు ప్రజల సమస్యల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని, వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాలు సక్రమంగా వస్తున్నాయా అంటూ అందరిని అడిగి తెలుసుకున్నారు.
త్వరలోనే కొత్త లబ్ధిదారులకు వితంతు, వృద్ధాప్య పింఛన్లు,  ఇండ్లు మంజూరు అవుతాయి అని ఈ సందర్భంగా తెలిపారు.
 గ్రామానికి 95 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు సాధ్యమైనంతవరకు పూర్తి అయ్యాయని ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ  ఎమ్మెల్యేకి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి తో పాటు కొల్లాపూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కిషన్ నాయక్, కోడేరు మండల సింగిల్ విండో చైర్మన్ జి చిన్నారెడ్డి, స్థానిక మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సూర్య రాజశేఖర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మల్లెపల్లి జగన్మోహన్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆర్ జగదీశ్వరావు, యువ నాయకులు చంద్ర శేఖర్,ముత్తిరెడ్డిపల్లి సర్పుంచు యం,నారమ్మ, యువ నాయకుడు రాజు, గ్రామ మాజీ సర్పంచు అంజలి గౌడ్, కోడేరు సర్పంచు వెంకటస్వామి, నాగులపల్లి సర్పంచ్, నాగులపల్లి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ, వెంకట స్వామి,లు జనుం పల్లి గ్రామ నాయకులు కుర్మయ్య, రాజాపురం టీఆర్ఎస్ నాయకులు బాలక రాముడు, పట్వారీ నాగిరెడ్డి, కేతావత్ డాక్యానాయక్,ప్రజాప్రతినిధులు,అధికారులు,టీ ఆర్ ఎస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు, వార్డు మెంబర్ లు   తదితరులు ఉన్నారు.

తాజావార్తలు