*ముంజ హరీష్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి*

*బీఎస్పీ పలిమెల మండల శాఖ డిమాండ్*

*పలిమెల, సెప్టెంబర్ 02 (జనంసాక్షి)* బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు రామగుండం ఎరువుల కర్మాగార ఉద్యోగాల పేరిట మోసపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ముంజ హరీష్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహరంతో పాటు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీఎస్పీ పలిమేల మండల కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని నిరసన చెసారు. ఈ కార్యక్రమంలో పలిమెల మండల కన్వీనర్ కలుగురి వెంకట్ మాట్లాడుతూ  ఉద్యోగం పేరిట డబ్బులు వసూలు చేసి మోసం చేసిన రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని  మరియు అదే విధంగా మోసపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన  బాధితుడు ముంజ హరీష్ గౌడ్ కుటుంబంనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 50 లక్షల ఎక్స్ గ్రేషియా తో పాటు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంజ హరీష్ గౌడ్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి చనిపోయిన నలుగురు మహిళల చావుకు కారణమైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను వెంటనే సస్పెండ్ చెయ్యాలని, ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలిమెల మండల సెక్టర్ అధ్యక్షులు
తోలం శ్రీనివాస్, మండల జనరల్ సెక్రెటరీ జనగామ రామ్మూర్తి, మండల కో కన్వీనర్ దుర్గం గోపి, పంకెన గ్రామ కన్వీనర్ జాడి భాస్కర్, వినయ్, తిప్పన పల్లి రమేష్, నరసింగరావు, తమ్మడి రాజు, చింతల అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు