ముందస్తు ఎన్నికలు రావు : ఏచూరి
హైదరాబాద: ఎస్పీ , బీఎస్పీ సిద్ధంగా లేకపోవడం వల్ల కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రావని సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి అన్నారు. వచ్చే ఎన్నికలకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని ఆయన హైదరాబాద్ లో అన్నారు. పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలోనే నిర్ణయిస్తామని.. ప్రస్తుతం ఉద్యమాలపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు.భాజపా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగానే కూటమి ఉంటుందని చెప్పారు.