ముంబయి మృతులకు నివాళి

ముంబయి : నవంబర్‌ 26, 2008లో ముంబయిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళులు అర్పించారు. ఆనాటి దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముష్కరుల దాడితో ముంబయి నగరం అల్లకల్లోలంగా మారింది. వందలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో చౌపట్టిలోని పోలీసుల జింఖానా మైదానంలో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ శంకర్‌నారాయణ్‌, మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ తదితరులు పాల్గొని మృతులకు నివాళి అర్పించారు.